ఐదేళ్ల తర్వాత తెలుగులో జ్యోతిక సినిమా.. బేబీ జాన్‌గా వరుణ్ ధావన్..

TV9 Telugu

07 February  2024

సీనియర్ నటి, అలనాటి కథానాయకి జ్యోతిక లీడ్ రోల్‌లో 2019లో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం రాక్షసి (రాట్చాసి).

రాట్చాసి సినిమాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రయత్నించే టీచర్‌గా నటించి ఆకట్టుకుంది నటి జ్యోతిక.

తమిళంలో ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడు తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

అమ్మ ఒడి అనే ఆకట్టుకొనే పేరుతో తెలుగులో విడుదల అవుతున్న ఈ సినిమాకు ఎస్‌వై గౌతమ్ రాజు దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా హిందీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం బేబీ జాన్.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దలపతి హీరోగా అట్లీ దర్శకత్వం వహించింది తమిళ తెరీ సినిమాకు రీమేక్ ఈ చిత్రం.

త‌మిళ ద‌ర్శ‌కుడు కాలీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, వామిక గ‌బ్బి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

తాజాగా వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న బేబీ జాన్ టీజర్ విడుదలైంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.