జ్యోతి రాయ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి జ్యోతి రాయ్ దాదాపు 20కి పైగా సీరియల్స్‌తోపాటు పలు సినిమాల్లోనూ నటించింది.
బుల్లితెర బ్యూటీ జ్యోతిరాయ్‌కి శాండల్‌వుడ్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. రాయ్ దియా, గంధాడ గుడి లాంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది.
తుళు, కన్నడ, తమిళం, తెలుగు వంటి పలు భాషల్లో నటించింది. కొన్నిరోజుల క్రితం జ్యోతిరాయ్ డైరెక్టర్ సురేష్ కుమార్ పూర్వాజ్‌ని రెండవసారి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
జ్యోతి రాయ్ కన్నడ చిత్రం నైస్ రోడ్ లో నటించింది. ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయాలని భావించారు. అయితే టైటిల్ కారణంగానే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ చిన్నది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను కవ్విస్తుంది ఈ వయ్యారి భామ.
హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తుంది. ఇదిలాఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.