02 February 2024

నెట్టింట వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఫేవరేట్ సాంగ్

TV9 Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం.. ఉన్నట్టుండి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అందర్నీ ఆకట్టుకుంటూనే.. ఎన్టీఆర్‌కు టేస్ట్‌ కు అందరూ సలాం అనేలా .. ఇంకొందరు భావోద్వేగానికి గురయ్యేలా చేస్తోంది.

ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాలు, ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ నెట్టింట నిత్యం షేర్ చేస్తుంటారు కొంతమంది ఫ్యాన్స్.

ఈ క్రమంలోనే తాజాగా తారక్ ఫేవరేట్ సాంగ్ షేర్ చేస్తున్నారు.

గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తారక్ తనకు ఇష్టమైన సాంగ్ గురించి చెప్పుకొచ్చారు.

షూటింగ్ నుంచి కాస్త సమయం దొరికినా ఎప్పుడూ అదే పాట వింటానని అన్నారు.

ఇప్పటివరకు తన ఫోన్ లో ఎక్కువగా ప్లే చేసిన సాంగ్ అదే అని అన్నారు. ఇంతకీ ఏ సాంగ్ అనుకుంటున్నారా ?.. అదే కేరాఫ్ కంచర పాలం సినిమాలోని.. ఆశ పాశం సాంగ్.

అయితే ఉన్నట్టుండి ఈ సాంగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారణంగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరో సారి అందరి ఫెవరెట్ సాంగ్ గా మారిపోతోంది.