హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ వాచ్ ధర
TV9 Telugu
11 April 2024
ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది.. అలానే ఎన్టీఆర్ కి రిస్ట్ వాచ్‌లంటే చాలా ఇష్టమని అంతకముందు ఒక ఇంటర్‌వ్యూ చెప్పాడు.
ఆ ఇష్టంతోనే ప్రపంచంలోని అరుదైన బ్రాండ్స్ కి చెందిన వాచ్ లను ఆయన సేకరిస్తూ ఉంటారు ఎన్టీఆర్. వాటి ధరలు కూడా అంతే ఉంటాయి.
తాజాగా ఆయన మరో లగ్జరీ వాచ్ ధరించి కనిపించారు. ఆ వాచ్ ధరను వెతికి సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
సిద్ధూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ ప్రెజెన్స్ జోష్ నింపింది.
అయితే ఈ వేడుక కోసం వచ్చిన ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఫ్యాన్స్ ని ఆకర్షించింది. దాని వివరాలు దాని ధర తెలుసుకుని షాక్ అయ్యారు.
ఆడేమార్స్ పిగెట్ రాయల్ ఓక్ బ్రాండ్ కి చెందిన సదరు వాచ్ ధర $ 189,000. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,57,32,455. అంటే కోటిన్నర.
ఇది కాక ఎన్టీఆర్ వద్ద ఉన్న మరో వాచ్ ధర రూ. 8 కోట్ల ఉంటుందని సమాచారం. ఈ ధర చూసి ఒక సామాన్యుడు లైఫ్ సెటిల్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి