ఎన్టీఆర్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? అసలు గెస్ చేయలేరు..

29 September 2024

Basha Shek

ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది.

సెప్టెంబర్ 27న విడుదలైన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెండురోజల్లోనే రూ. 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

కాగా దేవర ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ కపూర్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ 'ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో'లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నార్త్‌లో మీ ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్నకు తారక్‌.. శ్రీదేవి అని టక్కున సమాధానమిచ్చాడు.

ఇక జాన్వీ కపూర్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో తనే మా ఇంటి భోజనం టేస్ట్ చూపించానని తారక్ చెప్పుకొచ్చాడు.

అయితే తను ముంబై వెళ్లినప్పుడు మాత్రం జాన్వీ ఒక్కసారి కూడా ఇంటి భోజనం లేదా హోటల్‌ ఫుడో పంపించలేదన్నాడు ఎన్టీఆర్.

దేవర తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. అంతకుముందు దేవర పార్ట్ 2 పూర్తి చేయనున్నాడు.