TV9 Telugu
8 April 2024
సినిమా చూస్తున్నంత సేపు నవ్వు ఆపుకోలేకపోయాను: ఎన్టీఆర్
డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు సిద్దూజొన్నలగడ్డ. ఈ సినిమాతో సిద్దు స్టార్ హీరోగా మారిపోయాడు.
డీజే టిల్లుతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న సిద్దు ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మార్చ్ 29న విడుదలైన టిల్లు స్క్వేర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈసినిమాలో సిద్ధుకు జోడీగా అనుపమ నటించింది.
ఈ సినిమాలో తన నటనతో పాటు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్.
ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు.
టిల్లు స్క్వేర్ పై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు ఎన్టీఆర్. సిద్ధుకి సినిమా తప్ప మరొకటి తెలియదు అని అన్నారు ఎన్టీఆర్.
ఈ సినిమా చూస్తూ చాలా నవ్వాను.. ఇలాంటి సినిమాలు మరిన్ని ఇవ్వాలి. మరిన్ని క్యారెక్టర్స్ చెయ్యాలి అని దేవుడిని కోరుకుంటున్నా..
ఇక్కడ క్లిక్ చేయండి