21 November 2025

ఆ హీరోయిన్‏ను ఇష్టపడ్డా.. ఓపెన్‌గా చెప్పిన ఎన్టీఆర్..

Rajitha Chanti

Pic credit - Instagram

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఅర్.. ఇప్పుడు దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న పేరు) చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ నటిస్తుంది.

అలాగే దేవర 2 సినిమాతోనే మరోసారి అడియన్స్ ముందుకు రానున్నాడు. తారక్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భార్య, కొడుకులతో హ్యాప్పీగా ఉన్నాడు.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఓ హీరోయిన్ ను ఇష్టపడ్డారట. ఆమె అంటే క్రష్ అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు తారక్.

అప్పట్లో ఆ విషయం గురించి గట్టిగానే పబ్లిసిటీ చేశారని.. అది కేవలం ఇష్టం మాత్రమే అని .. 23 ఏళ్ల వయస్సులో అది జరిగిందని అన్నారు తారక్.

ఆ విషయం వల్ల తనకు ఎలాంటి సమస్య రాలేదని.. జీవితంలో తాను తీసుకున్న ఏ నిర్ణయం పట్ల బాధపడటం లేదని అన్నారు ఎన్టీఆర్. 

ఏదైనా నిర్ణయం తీసుకునేముందు 100 రకాలుగా ఆలోచిస్తానని ఎన్టీఆర్ తెలిపారు. ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను తాను అస్సలు కలపనని అన్నారు.

 ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు తారక్. డ్రాగన్ సినిమాతోపాటు త్వరలోనే దేవర చిత్రంలోనూ నటించనున్న సంగతి తెలిసిందే.