ఇద్దరు కాదు.. ఒక్కరే.! దేవర షాకింగ్ అప్డేట్..

Anil Kumar

29 May 2024

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎక్సయిటింగ్ సినిమా దేవర.

ఈ సినిమాను ఈ ఇయర్ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు కెప్టెన్‌ కొరటాల శివ.

అయితే ఈ సినిమా అన్నౌన్స్ చేసినప్పటి నుండి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.!

అందులో భాగంగా ఈ సినిమాలో తారక రాముడు ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు నెట్టింట బాగా వినిపించాయి.

"దేవ, వర" అనే పేర్లుతో.. తండ్రి కొడుకులకు సంబంధించిన రివెంజ్ స్టోరీగా ఈ మూవీపై అనేక వార్తలు వైరల్ అయ్యాయి.

ఇప్పటి వరకు ఎన్ని వార్తలు వచ్చిన వాటిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు మేకర్స్. తాజాగా దీనిపై మరొకటి వైరల్ అవుతుంది.

అయితే అవి కూడా "దేవ, వర" అనే రెండు పేర్లు ఒకే వ్యక్తికి సంబంధించినవి అని కూడా వార్తలు జోరందుకున్నాయి.

దేవర సినిమాలో తారక్‌ చేస్తున్నది సింగిల్‌ రోలేననే ప్రచారం జరుగుతోంది.. చూడాలి దీనిపై అయినా స్పందన వస్తుంది ఏమో.