హాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన తారక్.. నెక్స్ట్ మరో రికార్డు..!
20 October 2023
ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవటంతో కొద్ది రోజులుగా డల్ అయిన తారక్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసే అప్‌డేట్ ఒకటి హాలీవుడ్ నుంచి వచ్చింది.
ఆస్కార్ బరిలో తారక్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు జస్ట్ మిస్ అయ్యిందని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌కు అకాడమీ జ్యూరీ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ట్రిపులార్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సాధించిన తారక్, వరల్డ్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఆస్కార్ బరిలో బెస్ట్ యాక్టర్ అవార్డు మిస్ అయిన జూనియర్‌కు స్పెషల్ అప్రిషియేషన్ ఇచ్చింది అకాడమీ జ్యూరీ.
న్యూ మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లిస్ట్‌లో ఎన్టీఆర్‌కు స్థానం కల్పించింది అకాడమీ. ఈ అప్‌డేట్‌తో జూనియర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఆస్కార్ మిస్ అయినా, అకాడమీ యాక్టర్స్ లిస్ట్‌లో స్థానం దక్కటం గర్వంగా ఉందంటున్నారు అభిమానులు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీగా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో తారక్ నట విశ్వరూపం చూస్తారని ఎప్పటి నుంచో ఊరిస్తున్నారు కొరటాల.