తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఈనెల 27న విడుదల సిద్ధం అయింది
ఇక ఎన్టీఆర్ దేవర సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లి వచ్చిన ఎన్టీఆర్, ఆ తర్వాత హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ఉండగా ఓపెనింగ్స్ మాత్రం రికార్డ్ స్థాయి లో ఉండటం ఖాయం అని అభిమానులు అంటున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ సమయంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీ కపూర్ లు 'దేవర' కోసం అందుకున్న పారితోషికాల గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రూ.75 కోట్ల ను పారితోషికంగా తీసుకున్నాడట. అంతే కాకుండా లాభాల్లోనూ కొంత వాటాను తీసుకోబోతున్నాడని సమాచారం.
అయితే కొరటాల శివ ఈ సినిమాకి గాను రూ.30 కోట్ల పారితోషికం తీసుకోగా.. జాన్వీ రూ.5 కోట్ల పారితోషికం తీసుకుందట.
అంతే కాకుండా దేవర 2 కి అందరికీ అదనంగా అప్పటి మార్కెట్ ను బట్టి పారితోషికం ఉంటుందని సమాచారం అందుతోంది.