టిల్లుకు ఎన్టీఆర్ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే..
31 March 2024
సిద్దూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన సినిమా టిల్లు స్వ్కేర్. మార్చి 29న రిలీజ్ అిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది.
ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 45 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
యూత్‌కు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు సిద్దూ.
టిల్లు అనే వ్యక్తి తన ఆలోచనల నుంచి పుట్టిన ఓ విభిన్నమైన పాత్ర అని.. జీవితంలో ఎప్పుడూ అతడిలాంటి వ్యక్తిని చూడలేదని సిద్దూ జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు.
డీజే టిల్లును ఒక క్రైజమ్ థ్రిలర్ మూవీగా తెరకెక్కించాలనుకున్నామని.. ఊహించిన దానికన్నా ఆ పాత్ర పెరిగిందని.. ఒక్క ఘటనకు రియాక్ట్ అవుతుంటాడని తెలిపాడు.
అలాగే తన జీవితంలో ఎన్టీఆర్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు సిద్ధూ. గతంలో తారక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టిల్లుపై కామెంట్స్ చేశాడు.
తారక్ మాట్లాడుతూ.. "డీజే టిల్లులో సిద్దు జొన్నలగడ్డ ఇంటెన్సిటీ, ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. టీవీలో నుంచి బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది" అన్నారు.
తారక్ చేసిన ఆ కామెంట్స్ ఇప్పటివరకు తనకు వచ్చిన వాటిలో గొప్ప కాంప్లిమెంట్ అన్నారు సిద్దూ. అలాగే వెంకటేష్ తన ఆల్ టైమ్ ఫేవరేట్ హీరో అన్నారు.