దేవరకు బ్రేక్.. వార్ 2 బిగిన్స్
TV9 Telugu
14 March 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారిన తారక్.
ఇప్పుడు మాస్ యాక్షన్ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాపై మరింత
హైప్ నెలకొంది.
ఈ ఏడాదిలోనే దేవర చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఇప్పుడు దేవర చిత్రీకరణకు బ్రేక్ ఇవ్వనున్నాడట తారక్. త్వరలోనే ఆయన ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వార్ 2. ఈ మూవీతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు తారక్.
ఈ సినిమాలో తారక్ రోల్ పూర్తిగా నెగిటివిటీ విలనిజంతో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. లవకుశ తర్వాత మరోసారి విలనిజం చూపించనున్నాడు ఎన్టీఆర్.
వార్ 2 కోసం తారక్ 60 రోజులు డేట్స్ ఇచ్చారట. వీటిలో 30 రోజులు తన సోలో సీన్స్ కోసం.. మరో 30 రోజులు హృతిక్ తో కలిసి సీన్స్ చేయనున్నారట.
ఇక్కడ క్లిక్ చేయండి