ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ముందు
గా వచ్చేస్తున్న దేవర
TV9 Telugu
14 June 2024
ఎన్టీఆర్ దేవర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆర్ఆర్ఆర్ తరువాత ఎలాగైనా హిట్ కొట్టాలనే పని మీద ఉన్నాడు యంగ్ టైగర్.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
ఆచార్య డిజాస్టర్ తరువాత కూడా ఎలాగైనా నిలబడాలనే ప్రయత్నంలో ఎంతో కసిగాఉన్నారు డైరెక్టర్ కొరటాల శివ..
అందుకే ఈ సినిమాను ఒక శిల్పాన్ని చెక్కిన్నట్లు చెక్కారు. అసలు అన్ని బాగుంటే ఈ పాటికే దేవర రిలీజ్ అవ్వాల్సింది.
అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా వెనక్కి వెళ్తూ వస్తుంది. అలా చివరికి దేవర రెండు పార్ట్స్ గా రాబోతుంది.
ఇది ఇలా ఉంటే అనేక వాయిదాల తరువాత దేవర మొదటి పార్ట్ అక్టోబర్ 10 న రిలీజ్ అవ్వడానికి సిద్దమయ్యింది.
అయితే ఇప్పుడుదాన్నే అధికారికం చేస్తూ మేకర్స్ సైతం కొత్త పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27 న దేవర వస్తున్నాడు అని తెలిపారు.
ఇక్కడ క్లిక్ చేయండి