29 September 2024

'దేవర' భీభత్సం.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..? 

Rajitha Chanti

Pic credit - Instagram

ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది. 

దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్, పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. 

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

తాజాగా రెండు రోజులకుగానూ దేవర సినిమా ఏకంగా రూ.243 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మరోసారి చిత్రయూనిట్ తెలిపింది. 

అంటే రెండో రోజు కేవలం రూ.71 కోట్లు మాత్రమే ఈ చిత్రం కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆదివారం, సోమవారం వసూళ్లు పెరగనున్నాయి. 

అలాగే మరో రెండు రోజుల్లో దసరా సెలవులు మొదలుకానుండడంతో దేవర సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

దేవర ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 360 కోట్లకు పైగా రావాలి.

దసరా సెలవులు, కలెక్షన్స్ చూస్తుంటే మరికొన్ని రోజుల్లో ఈజీగా రూ.500 కోట్లు గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.