07 December 2023

యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ.. మీకోసమే దిమ్మతిరిగే న్యూస్

కొరటాల శివ డైరెక్షన్లో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర. 

ఆఫ్టర్ RRR సూపర్ డూపర్ హిట్.. తారక్ చేస్తున్న ఈ మూవీ వైపే.. ప్రస్తుతం అందరి చూపు ఉంది. 

ఇక అందుకు తగ్గట్టే ఈ మూవీ షూట్‌ను.. డైరెక్టర్ కొరటాల శివ.. పరిగెత్తిస్తున్న పరిస్థితి. 

పైగా ఏప్రిల్ 5న.. ఎలాగైన ఈ మూవీని రిలీజ్ చేయాలనే టార్గెట్ కూడా ఉంది. 

దీంతో ఈ మూవీ నుంచి ఓ పవర్ ఫుల్ టీజర్‌ను రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నట్టు వినికిడి.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న దేవర మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. 

అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.