జానీ మాస్టర్‌ హీరోగా కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల..

టాలీవుడ్‌తోపాటు హిందీ, కన్నడ, తమిళం చిత్రాల్లో కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చికున్నారు జానీ మాస్టర్‌.

టెలివిజన్ లో పలు డ్యాన్స్‌ షోలలో జడ్జిగా కూడా కనిపించరు.

తాజాగా ఓ చిత్రంతో హీరోగా అవతారమెత్తారు జానీ మాస్టర్‌.

విజయ్ చౌదరి తెరకెక్కిస్తున్న ‘రన్నర్‌’ అనే చిత్రం అయన హీరోగా చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం శ్రీహరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు .

ఆదివారం జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ను ప్రకటించింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ జానీ మాస్టర్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.

తండ్రీకొడుకుల మధ్య సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది.

హీరోగా జానీ మాస్టర్‌ క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా ఉండనుందిని తెలిపారు మేకర్స్.