TV9 Telugu
దర్శకుడిగా జయం రవి.. డాన్ 3 సందడి మొదలు..
22 Febraury 2024
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి దర్శకుడిగా మారబోతున్నారు. త్వరలోనే డైరెక్టర్ గా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు.
సైరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తమిళ హీరో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
త్వరలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు లీడ్ రోల్‌లో తన డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నట్టుగా వెల్లడించారు.
మరో రెండు సినిమాలు కూడా ఆయన దర్శత్వంలో రూపొందడానికి లైన్‌లో ఉన్నాయన్నారు కోలీవుడ్ పొన్నియన్ సెల్వన్.
బాలీవుడ్‌లో డాన్ 3 సందడి మొదలైంది. గతంలో షారూఖ్ ఖాన్ నటించిన డాన్ సిరీస్‌లోకి ఇప్పుడు రణవీర్ సింగ్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసారు మూవీ మేకర్స్.
తాజాగా డాన్ 3 సినిమాలో రణవీర్‌కు జోడిగా నటించబోయే హీరోయిన్‌కు సంబంధించిన న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది.
హ్యాపెనింగ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో గేమ్ చెంజర్ లో నటిస్తుంది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చేయండి