బాలీవుడ్ సెలబ్రిటీల ఆస్తుల వివరాలను.. ఎవరికీ ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంటుంది.
ఇళ్లు, వాహనాలు, బిజినెస్ లు ఇతర ఇతర స్థిరాస్తుల వివరాలేంటో తెలుసుకునేందుకు తాపత్రయపడుతుంటారు కొందరు అభిమానులు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతున్నారు.
ఇక అసలు విషయం ఏంటంటే.. తాజాగా అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ మరోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారన్న విషయం తెలిసిందే.
సమాజ్‌వాదీ పార్టీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు జయాబచ్చన్.
నామినేషన్ సమయంలో ఇచ్చిన ఆస్తుల వివరాల ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువ సుమారుగా 1,578 కోట్లు.
2022 – 2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత ఆస్తుల నికర విలువ 1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్ నికర విలువ 273.74 కోట్లుగా పేర్కొన్నారు.
ఆమె బ్యాంకులో 10 కోట్లు ఉండగా అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ 120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ 849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ 729 కోట్లుగా ఉందని తెలిపారు.