1000కోట్లు కొల్లగొట్టిన జవాన్.. నయా హిస్టరీ రిపీట్
08 October 2023
రీసెంట్‌గా రెండు మూడేళ్ల నుంచి.. షారుఖ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఆ సినిమా బాక్సాఫీస్ ముందు వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే టాక్ వచ్చేది.
నయా రికార్డులు కొల్లగొడతారనే న్యూస్ మీడియాలో మార్మోగేది. కానీ.. రియాల్టీలో మాత్రం.. ఆ రేంజ్ కలెక్షన్స్ చేయలేక షారుఖ్ సినిమా బొక్కబోర్లా పడేది.
అందర్నీ డిస్సపాయింట్ చేసేది. కానీ ఈసారి మాత్రం.. అందిరి ఊహ నిజమైంది. షారుఖ్ లెటెస్ట్ ఫిల్మ్ జవాన్ తాజాగా వెయ్యి కోట్ల మార్క్‌ను దాటేసింది.
బాలీవుడ్‌లోనే నెంబర్ 1 సినిమాగా హిస్టరీకెక్కింది. ఎస్ ! అట్లీ డైరెక్షన్లో.. షారుఖ్ హీరోగా చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ జవాన్.
ఎన్నో అంచనాల మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..డే వన్ దిమ్మతిరిగే ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకుంది.
ఆ తరువాత అదే ఊపులో.. వరుసగా.. నాలుగు రోజులు.. ప్రతీ రోజు వలర్డ్ వైడ్ 100కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది.
ఇక ఆక్రమంలోనే వెయ్యి కోట్ల మార్క్ దాటే సినిమా అవుతుందనే టాక్ బాలీవుడ్‌లో బజ్ చేసింది. తాజాగా షారుఖ్ జవాన్ మూవీ.. వెయ్యి కోట్ల మార్కును దాటేసింది.
వరల్డ్ వైడ్ దాదాపు 1100కోట్ల కలెక్షన్స్ రాబట్టిన మొట్టమొదటి హిందీ సినిమాగా హిస్టరీకెక్కింది.ఇక ఈ ఫీట్‌తో.. త్రూ అవుట్ ఇండియా విపరీతంగా బజ్ చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి