జవాన్ కలెక్షన్ల సునామి..

11 September 2023

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన 'జవాన్'​దుమ్మురేపుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనె కీలక పాత్రలో కనిపించరు.

ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సరసన నయనతార నటించింది. దీంతో తన అభిమాన హీరోతో నటించాలన్న నయన్ కోరిక ఫలించింది.

ఫస్ట్ డే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. మాస్ జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతుంది ఈ చిత్రం.

ఈ చిత్రం ఫస్ట్ డే దేశవ్యాప్తంగా రూ. 75 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

అయితే అనూహ్య రీతిలో ఫస్ట్ డే రికార్డు.. నాలుగో రోజు బ్రేకైంది. ఈ సండే ఈ జవాన్ దేశవ్యాప్తంగా.. రూ.81 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డులు తిరగరాసింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జవాన్ రూ.287 కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రికార్డ్స్ క్రియిట్ చేసుకుంటూ పోతుంది.

ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ. 520.79 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మరిన్ని వసూళ్లు సందించనుంది

ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. ప్రియమణి, సన్యా మల్హోత్రా సపోర్టింగ్ రోల్స్ కనిపించరు.