06 November 2023
రామ్ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ ?..
Pic credit - Instagram
దఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది ఈ బ్యూటీ.
ఆ తర్వాత హిందీలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ.
అలాగే ఇప్పుడు దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇందులో ఎన్టీఆర్ జోడిగా తంగం పాత్రలో కనిపించనుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఇక తాజాగా జాన్వీ స్పెషల్ సాంగ్ చేయనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఎవరిదో తెలుసా ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. అయితే ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట.
అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి. కానీ జాన్వీ ఈ సాంగ్ చేస్తే అదిరిపోతుందటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.