TV9 Telugu
29 January 2024
ఆ స్టార్ హీరోతో తమిళంలోకి అరంగేట్రం చేస్తోన్న జాన్వీ.!
దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీవైపు అడుగులు వేస్తుంది.
ఇన్నాళ్లు బాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాలో నటిస్తుంది.
ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో..
తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి సినిమాలో జాన్వీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సూర్య కంగువ చిత్రం తర్వాత సూర్య జోడిగా జాన్వీని సెలక్ట్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాతోనే జాన్వీ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుందని అంటున్నారు.
ఇవే కాకుండా సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి