27 August 2025

చేసిన ఒక్క సినిమా బ్లాక్ బస్టర్.. క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు హిందీలో సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది ఈ వయ్యారి. 

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ ముద్దుగుమ్మ హిందీతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే మంచి కమర్షియల్ హిట్టు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తుంది. హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా రెండు ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. 

తాజాగా హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా జోడిగా పరమ్ సుందరి చిత్రంలో నటించింది. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. 

ఇప్పటివరకు స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ హిందీలో మాత్రం సక్సెస్ మాత్రం కాలేక పోయింది. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం చూస్తుంది. 

ధడక్ సినిమాతో హిందీలోకి నటిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటివరకు హిందీ సినిమాల్లో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

ఇప్పుడు జాన్నీ కపూర్ ఆశలన్నీ పరమ్ సుందరి సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.