ఎందుకు సినీతారలే టార్గెట్‌గా డీప్ ఫేక్ వీడియోస్, ఫేక్ అకౌంట్స్..

Anil Kumar

22 June 2024

ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియా ప్రపంచంలో పలువురు సెలబ్రెటీస్ తరచూ ఫేక్ అకౌంట్స్ భారీన పడుతున్నారు.

ఓవైపు డీప్ ఫేక్ వీడియోస్, మరోవైపు ఫేక్ ఖాతాలకు సినీతారలు టార్గెట్‌గా అవుతున్న టైంలో జాన్వీ ది ఇలాంటి సమస్యే..

ఇది జరిగి రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికి ఈ వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ కాబట్టే అంటున్నారు.!

ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.? సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇన్ స్టాలో నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది ఈమె.

ఇప్పటికి ట్రెండ్ అవుతున్న న్యూస్.. జాన్వీ సోషల్ మీడియా అకౌంట్స్ విషయంలో క్లారిటీ ఇచ్చారు జాన్వీ కపూర్‌.

రీసెంట్ గా జాన్వీ పేరుతో ఉన్న ఎక్స్‌ అకౌంట్‌లో అశ్లీల చిత్రాలు కనిపించటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ విషయం జాన్వీ టీమ్ గుర్తించి క్లారిటీ ఇచ్చింది. ఆమెకు ఎక్స్‌లో ఖాతా లేదని క్లారిటీ ఇచ్చింది జాన్వీ టీమ్‌.