అదే చెత్త ట్రోలింగ్.. దారుణంగా అవమానించారు.. జాన్వీ కపూర్.
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్లో టాప్ హీరోయిన్ జాన్వీ కపూర్.. ఇప్పుడు దక్షిణాదిలో సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే జాన్వీ పోస్టర్స్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే.
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది. బుచ్చిబాబు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్.
ఇక ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ మాట్లాడుతూ ఈ సినిమా గురించి తనను దారుణంగా ట్రోల్ చేశారని చెప్పింది.
స్పోర్ట్స్ డ్రామాలో నటించినందుకు తనను పెద్దగా ట్రోల్ చేశారని తెలిపింది. ఓ డాక్టర్ ఖాతాలో తన గురించి ప్రస్తావిస్తూ పరమ చెత్త అన్నాడని చెప్పుకొచ్చింది.
క్రికెట్ ఆధారిత సినిమా చేయడానికి చెత్త అభ్యర్థి అంటూ తనను ట్రోల్ చేశాడని తెలిపింది. తాను ఏం చేసిన ట్రోలింగ్ ఆగవని.. కొన్నిసార్లు బాధిస్తాయని తెలిపింది.
ఈ సినిమా కోసం తాను ఏడాదిపాటు క్రికెట్ ఆడడం నేర్చుకున్నాని.. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు భుజాలకు గాయాలు అయ్యాయని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.