ఆ బాధ నుంచి బయటకు రావాలనే ఆ పని చేశాను.. జాన్వీ కపూర్..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కొన్ని రోజులుగా మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి శ్రీదేవి మరణించిన సమయంలో తనపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారని.. ఆ రోజులను మళ్లీ గుర్తు చేసుకుంది జాన్వీ.
అమ్మ మరణించిన కొన్ని రోజులకే ధడక్ ప్రమోషన్లలో పాల్గొన్నాను. ఈ క్రమంలోనే ఓ డాన్స్ రియాల్టీ షోలో అమ్మ పాటలకు డాన్స్ చేస్తూ ఆమెకు నివాళలు ఇచ్చారు.
వారి డాన్స్ బాగున్నప్పటికీ చూడలేకపోయాను. గట్టిగా కేకలు వేసి ఏడుస్తూ అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. దీంతో అక్కడున్నవారంతా ఆ కార్యక్రమాన్ని ఆపేశారు.
అమ్మ మరణం నన్ను ప్రభావితం చేయలేదని.. నేను బాధపడలేదని చాలా మంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది.
ఆ బాధ నుంచి బయటకు రావడానికే నేను పనిపై దృష్టి పెట్టాను. అందుకే ధడక్ ప్రమోషన్లలో పాల్గొన్నాను. కానీ అదేమీ అర్థం చేసుకోకుండా నన్ను చాలా మాటలు అన్నారు.
ఆ బాధ నుంచి బయటకు రావడానికే నేను పనిపై దృష్టి పెట్టాను. అందుకే ధడక్ ప్రమోషన్లలో పాల్గొన్నాను. కానీ అదేమీ అర్థం చేసుకోకుండా నన్ను చాలా మాటలు అన్నారు.
ప్రస్తుతం జాన్వీ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడిగా బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ మూవీ చేయనుంది.