24 December 2023

Pic credit - Instagram

మెలిమి బంగారంలా మెరిసిపోతున్న జాన్వీ.. అతిలోక సుందరిలా.. 

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. 

దఢక్ అంటూనే అడియన్స్ మనసులను తాకింది. ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలను... అంతకు మించిన పాత్రలను ఎంచుకుంటూ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. 

ఇప్పటికే హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన జాన్వీ.. ఇప్పుడు దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. 

అనుకున్నట్లే తన అభిమాన హీరో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇందులో గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. 

ఓవైపు సినిమా చిత్రీకరణలో పాల్గొంటూనే మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది జాన్వీ. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. 

తాజాగా చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ అచ్చం అతిలోక సుందరి తనయగా కనిపిస్తుంది. చీరకట్టులో జాన్వీ కొత్త ఫోటోస్ మరింత అందంగా.. మైమరపిస్తున్నాయి. 

దేవర సినిమా తర్వాత తెలుగులో జాన్వీకి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు.  ఈసినిమా తర్వాత రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. 

అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు సినిమాలతో.. మరోవైపు వరుస ఫోటోషూట్లతో జాన్వీ మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది.