అతడితో వారంలో నా పెళ్లి చేసేలా ఉన్నారు.. జాన్వీ కపూర్ కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది హీరోయిన్ జాన్వీ కపూర్. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాలోనూ జాన్వీ ఎంపికైంది. ఈ మూవీని ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న జాన్వీ కపూర్.. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి రూమర్స్ పై స్పందించింది.
ఇటీవల తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను చదివానని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అందులో రాశారని.. ఇప్పటికే అలా చాలాసార్లు రాశారని తెలిపింది.
పలు ఇంటర్వ్యూలో చెప్పిన రెండు, మూడు కథనాలను మిక్స్ చేసి అలా రాశారని.. తనకు తెలియకుండానే వారంలో తన పెళ్లి కూడా చేసేలా ఉన్నారని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాను కేవలం కెరీర్ పై మాత్రం దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో కొన్నాళ్లుగా వైరలవుతున్న పెళ్లి వార్తలకు చెక్ పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి బయట కనిపించడమే కారణం.
వీరిద్దరు కలిసి ఓసారి తిరుమలకు కూడా వెళ్లారు. అలాగే ఇటీవల జాన్వీ మెడలో శిఖు పేరుతో చైన్ ధరించడంతో జాన్వీ ప్రేమ, పెళ్లి వార్తలు బలం చేకూరింది.