దాని వల్ల చాలా భయపడ్డా.. పైగా అదే ఫస్ట్ టైం.! జాన్వీ కపూర్.
Anil Kumar
29 July 2024
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో.. వరస అవకాశాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో నటిస్తుంది.
అలాగే తెలుగులో ఆర్సీ 16 తో పాటు., నాని హీరోగా చేస్తున్న కొత్త సినిమాల్లోనూ నటించనుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటు తెలుగులో సినిమాలను ఓకే చేస్తూనే మరోవైపు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. మరో పక్క యాడ్స్ తో దూసుకుపోతుంది.
అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే జాన్వీ.. తాజాగా తాను హాస్పిటల్ లో జాయిన్ అయ్యిన దానిపై మాట్లాడింది.
ఫుడ్ పాయిజన్ వల్ల చాలా భయపడినట్టు తెలిపారు. తాను హాస్పిటల్‌లో చేరడం ఇదే మొదటిసారి అని అన్నారు జాన్వీ.
ఎవరైనా సరే, తమ పని కన్నా ముందు తమ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్.
ఇక ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కుదుటపడుతోందని.. త్వరలోనే సెట్స్ కి వెళ్తానని తెలిపారు ఈ బీ టౌన్ బ్యూటీ..
ఇక్కడ క్లిక్ చెయ్యండి