మళ్లీ పల్లెటూరి గెటప్‌లో?

TV9 Telugu

08 March 2024

ఇండస్ట్రీలో పల్లెటూరి గెటప్పులకు పేటెంట్‌ హక్కులు తీసుకుంటున్నట్టున్నారు అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్‌.

లేటెస్ట్ గా రామ్‌చరణ్‌ జోడిగా మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశారు బాలీవుడ్ స్టార్ కథానాయకి జాన్వీ కపూర్.

ఆర్సీ 16 సినిమాని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించడానికి ఆల్రెడీ బుచ్చిబాబు సానా ఫిక్సయిపోయారు.

ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్‌ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

ఇందులో హీరోయిన్‌గా దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తారని ఆ మధ్య వార్తలు సోషల్ మీడియా వేదిక గుప్పుమన్నాయి.

వాటిని బోనీకపూర్‌ కూడా ధ్రువీకరించారు. నేను చేయట్లేదు.. మరి నాన్న ఎందుకు అలా చెప్పారో నాకు అర్థం కావడం లేదంటూ వార్తలను ఖండించారు జాన్వీ.

ఇప్పుడు ఫైనల్‌గా ఆమెకు వెల్కమ్‌ చెప్పేసింది మూవీ టీమ్‌. ఆల్రెడీ తెలుగులో జాన్వీ చేస్తున్న సినిమా దేవర.

ఇందులోనూ పల్లెటూరి గెటప్‌లోనే కనిపిస్తున్నారు. నార్త్ లో డెబ్యూ మూవీలోనూ సేమ్‌ గెటప్‌ చేశారు జాన్వీ. సో, కలిసొచ్చిన కేరక్టర్‌ని రిపీట్‌ చేస్తున్నారు.