08 February 2024

సీతగా కనిపించనున్న జాన్వీ కపూర్.. ఇంతకీ ఇది నిజమేనా ?.. 

TV9 Telugu

Pic credit - Instagram

ప్రస్తుతం దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది జాన్వీ కపూర్. ఈ మూవీతోనే ఆమె తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. 

అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమాలోనూ జాన్వీ నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంకా క్లారిటీ రానుంది. 

అలాగే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో ఛాన్స్ కొట్టేసిందట. 

కొన్నిరోజులుగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఇందులో సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుందని టాక్. 

అయితే ఇప్పుడు ఈ సినిమాలో సీత పాత్రలో జాన్వీ కపూర్ నటించనుందని టాక్ వినిపిస్తుంది. నితేష్ తివారీ ఆఫీస్ వద్ద జాన్వీ కనిపించడంతో ఈ వార్త వినిపిస్తుంది. 

లుక్ టెస్ట్ కోసమే ఆమె అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు. నితేష్ దర్శకత్వం వహించిన బవాల్ సినిమాలో జాన్వీ నటించింది. అందులో ఆమె నటన మెప్పించింది. 

దీంతో ఇప్పుడు రామాయణం సినిమాలోనూ సీత పాత్రలోన జాన్వీని ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. 

ఈ మూవీ రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యశ్, విభీషణుడిగా విజయ్ సేతుపతి, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది.