03 February 2025

జాన్వీ కపూర్ ఆస్తులు ఎంతో తెలుసా.. తన ప్రియుడి కంటే తక్కువే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ మరింత తీరిక లేకుండా గడుపుతుంది.

గతేడాది జూనియర్ ఎన్టీఆర్ జోడిగా దేవర సినిమాతో దక్షిణాదికి పరిచయమైంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో నటిస్తుంది.

కొన్నిరోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అలాగే అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది  ఈముద్దుగుమ్మ.

ఇక జాన్వీ కపూర్ ఆస్తుల విషయానికి వస్తే రూ.82 కోట్లు. ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్. 

అలాగే ఆమె సోషల్ మీడియాలో ఒక్కో పోస్టుకు రూ.80 లక్షలు వసూలు చేస్తుంది. యాడ్స్ ద్వారా రూ.3 కోట్ల వరకు సంపాదిస్తుంది. 

అంతేకాకుండా ఒక్క బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం ఆమె దాదాపు కోటి తీసుకుంటుంది. జాన్వీ కపూర్ ఇంటి విలువ దాదాపు రూ.39 కోట్లు. 

ఇదిలా ఉంటే.. ఆమె ప్రియుడు శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమారుడు అన్న సంగతి తెలిసిందే. 

శిఖర్ పహారియా ఆస్తులు రూ.84 కోట్లు. అలాగే అతడు ప్రస్తుతం గేమింగ్ రంగంలో ఉన్నాడు. వీరిద్దరి ఆస్తులు మొత్తం రూ.166 కోట్లు.