అందం ఈ వయ్యారిని తాకి వజ్రంగా మారుతుందేమో..

TV9 Telugu

29 March 2024

6 మార్చి 1997న మహారాష్ట్రావ్ రాజధాని ముంబైలో బోనీ కపూర్, అతిలోక సుందరి శ్రీదేవి దంపతులకు జన్మించింది జాన్వీ కపూర్.

నటులు అనిల్ కపూర్ సంజయ్ కపూర్‌లకు మేనకోడలు ఈ వయ్యారి. ఈ బీయూటీకి ఖుషీ కపూర్ అనే చెల్లెలు కూడా ఉంది. ఆమె కూడా నటి.

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్‌లో పాఠశాల విద్య అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.

కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి యాక్టింగ్ కోర్స్ చేసింది.

2018లో శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ధడక్‌లో ఇషాన్ ఖట్టర్‌ జోడిగా సినీ అరంగేట్రం చేసింది ఈ అందాల భామ.

తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్, గుడ్ లక్ జెర్రీ, మిల్లి, బవాల్ వంటి చిత్రాల్లో నటించింది ఈ అందాల భామ.

ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది. ఇది ఈ వయ్యారి తొలి టాలీవుడ్ చిత్రం.

దీంతో పాటు రామ్ చరణ్ కి జోడిగా RC16లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ. తెలుగులో ఈమెకు వరుస సినిమాలు క్యూ కడుతున్నాయి.