పెళ్లి చేసుకుని ముగ్గురి పిల్లల్ని కనాలనుంది: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

23 January 2025

Basha Shek

 ఇతర రంగాలతో పోల్చుకుంటే సినిమా హీరోయిన్లు అంత త్వరగా పెళ్లి చేసుకోరు. అందుకు చాలా కారణాలున్నాయి. 

పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే సినిమా అవకాశాలు తగ్గుతాయని హీరోయిన్ల భయం. కానీ జాన్వీ కపూర్ మాత్రం అలా కాదు.

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న జాన్వీ ప్రస్తుతం తారక్ తో 'దేవర2', రామ్ చరణ్ తో 'ఆర్సీ 16' సినిమాలు చేస్తోంది.

తాజాగా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ తన పెళ్లి జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుందని,  భర్త, ముగ్గురు పిల్లలతో తిరుమలలో హాయిగా గడపాలనుందని తన మనసులోని మాటను బయటపెట్టింది.

ప్రతిరోజు అరటి ఆకులో అన్నం తింటూ... గోవిందా గోవిందా అని స్మరించుకోవాలనుందన్న కోరికను బయట పెట్టింది జాన్వీ.

.అలాగే  దిగ్గజ దర్శకుడు మణిరత్నం సినిమాల్లోని పాటలు  వింటూ రోజంతా గడిపేయాలని ఉందని జాన్వీ కపూర్ తెలిపింది.

జాన్వీకి తిరుమల వేంకటేశ్వరస్వామిపై అమితమైన భక్తి ఉందనే విషయం తెలిసిందే.  సమయం దొరికినప్పుడల్లా శ్రీవారి దర్శనానికి వస్తుంటుంది.