20 February 2024

RC16 లో జాన్వీ.. కన్ఫామ్ చేసిన బోనీ కపూర్

TV9 Telugu

చెర్రీ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చేస్తున్న సినిమానే rc16. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్‌లో.. మట్టి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి.

మొత్తానికి అందరూ అనుకున్నదే నిజం అయింది. శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్.. చిరు సన్ మెగా పవర్ రామ్ చరణ్ కు జోడీగా సెట్ అయింది.

ఇద్దరి కలయిక సిల్వర్‌ స్క్రీన్ కుదిరింది. ఇదే ఇప్పుడు అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు బాలీవుడ్.. టాలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్ అవుతోంది.

ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లోకి దేవర మూవీతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన జాన్వీ కపూర్.. నెక్ట్స్‌ రామ్ చరణ్ ఆర్సీ 16లో నటిస్తోందట.

ఇదే విషయం ఇప్పటి వరకు అఫీషియల్ గా తెలియకపోయినా.. జాన్వీ ఫాదర్ బోనీ కపూర్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో లీక్ చేశారు.

తన కూతురు జాన్వీ కపూర్, రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా అయిన RC16 లో చేస్తున్నట్టు రివీల్ చేశారు బోనీ కపూర్.

తొందర్లో షూటింగ్‌ కూడా మొదలు కానుంది.  ఈ టైంలో చెర్రీకి జోడీగా జాన్వీ యాక్ట్ చేస్తున్నారనే న్యూస్.. ఇప్పుడు ఈ సినిమా వైపు అందరూ ఓ లుక్కేసేలా చేస్తోంది.