11 September 2023

సౌత్ లో ఆ స్టార్‌ హీరోతో నటించద్దు! జాన్వీకి బోనీ కపూర్‌ కండీషన్‌

అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్టార్ హీరోయిన్  జాన్వీ కపూర్ 

మొదటి సినిమా (ధడక్‌) తోనే  అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది 

ఆతర్వాత  గుంజన్‌ సక్సేనాతో సూపర్‌హిట్‌ సినిమాను ఖాతాలో వేసుకుంది. ఇందులో తన పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది

బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ అందాల తార త్వరలోనే దక్షిదాది ఇండస్ట్రీకి కూడా    పరిచయం కానుంది

ఎన్టీఆర్‌ నటిస్తోన్న దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. సినిమాలో ఇప్పటికే ఆమె లుక్‌ వైరలైంది.

కాగా సౌత్‌లో ఎంట్రీకి ఇచ్చేముందు నిర్మాత తండ్రి బోనీ కపూర్‌ జాన్వీ కపూర్‌కి ఒక సీరియస్‌ కండీషన్‌ పెట్టారట

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌తో  యాక్ట్‌ చేయవద్దని సూచించారట. అయితే దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.