03 January 2024

నోరు జారింది.. ప్రేమాయణం బయటపడింది.. పాపం జాన్వీ

TV9 Telugu

శ్రీదేవీ వారసురాలిగా ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. ట్యాలెంట్‌ స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది జాన్వీ కపూర్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలో.. ఇటు టాలీవుడ్‌లోనూ గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు.

అయితే తాజాగా కాఫీ విత్ కరణ్‌ షోలో.. అనుకోకుండా నోరు జారీ తన భాయ్‌ ఫ్రెండ్ నేమ్‌ తనే చెప్పారు.

షోలో ఓ టాస్క్‌లో భాగంగా... కరణ్ జోహార్ జాన్వీని తన స్పీడ్ డయల్‌లో ముగ్గురి పేర్లు చెప్పమని అడిగాడు.

దానికి జాన్వీ సమాధానమిస్తూ, “పాపా, ఖుషు అలాగే సిఖు” అని స్పీడ్‌గా చెప్పారు. అయితే ఇక్కడ సిఖు అంటే శిఖర్ పహారియా.

శిఖర్ పహాడియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు.

కొన్ని రోజుల నుంచి పార్టీలు.. పబ్బల్లో జాన్వీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.

జాన్వీ నోరు జారడం కారణంగా మరోసారి బుక్కయ్యారు. లవ్‌లో ఉన్నారనే అనుమానం ఇంకాస్త బలపడేలా చేశారు.