వా నువ్వు కావాలయ్యా అంటూ తమన్నా పాడిన లిరిక్స్ ని ఇష్టంగా పాడుకుంటున్నారు రజనీకాంత్ ఫ్యాన్స్. వాళ్ల జోష్ ఇప్పుడు మామూలుగా లేదు.
కుర్ర హీరోలు సక్సెస్లు లేకుండా చతికిలబడుతుంటే, ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశారు రజనీకాంత్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 72 ఏళ్ల రజనీ ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మరింత గ్లోతో కనిపిస్తున్నారు.
జైలర్ సినిమాకు 600 క్రోర్స్ ప్లస్ కలెక్షన్లు వచ్చాయి. ఆల్రెడీ 2.0 పేరు మీదున్న రికార్డులను టచ్ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
హెచ్‌డీ క్వాలిటీతో ప్రింట్ లీక్ కావడంతో కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయిగానీ, లేకుంటే గ్రాఫ్ ఇంకో రేంజ్‌లో ఉండేదే.
అయినా మేం హ్యాపీ అంటోంది ప్రొడక్షన్ హౌస్. హ్యూజ్ నెంబర్ ఉన్న చెక్‌తో పాటు, బీ ఎండబ్ల్యూ కార్లు రెండిటిని రజనీ ముందు నిలిపేశారు కళానిధి మారన్.
వాటిలో బీఎండబ్ల్యూ ఎక్స్ 7 మోడల్‌ని సెలక్ట్ చేసుకున్నారు తలైవర్. ఇది కదా సక్సెస్ అంటే, ఇది కదా గౌరవమంటే అంటూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు రజనీ ఫ్యాన్స్.
జైలర్ సినిమాలో రజనీ పార్ట్ ఏంటని డిస్కస్ చేసుకుంటున్నారు. గట్టిగా యాక్షన్ చేయలేదు, కాళ్లు కదిపి స్టెప్పులేయలేదు. స్టైలిష్ కాస్ట్యూమ్స్ లేవు... అయినా ఎందుకు నచ్చిందని మాట్లాడుకుంటున్నారు.
రజనీ తన ఏజ్‌కి తగ్గ కథను సెలక్ట్ చేసుకున్న తీరు, సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసిన విధానం ఫ్యాన్స్ కి కొత్తగా అనిపించిందన్నది మెజారిటీ మాట.