02 October 2023
జైలర్ చిత్రం ఏకంగా 650 కోట్లకు పైగా వసూలు చేసింది. రజినీ హిట్‌తో విజయ్‌కు టెస్టింగ్ టైమ్ మొదలైందిప్పుడు. కొన్నేళ్లుగా కోలీవుడ్‌లో అన్ అఫీషియల్ నెంబర్ వన్‌గా ఉన్నారు విజయ్.
ఐదారేళ్లుగా విజయ్ సినిమాలు ఈజీగా 300 కోట్లు క్రాస్ చేస్తున్నాయి. నెగిటివ్ టాక్‌తోనూ 200 కోట్లకు పైగానే వసూలు చేస్తున్నారీయన.
అదే సమయంలో రజినీ సినిమాలు బోల్తా కొట్టాయి. రజినీ జైలర్ తో కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్‌తో ఎవరూ ఊహించని విజయం అందుకున్నారు. రజినీ సినిమా హిట్టైతే.. ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించింది జైలర్.
రజినీ ఫామ్‌లోకి రావడంతో రేస్ ఆసక్తికరంగా మారింది. లియోతో జైలర్‌ను మించే హిట్ కొట్టాలి విజయ్.. లేదంటే చాలా ఈజీగా దళపతిని సూపర్ స్టార్ క్రాస్ చేస్తారు.
అయినా రజినీ ఫామ్‌లోకి వచ్చాక నెంబర్ గేమ్‌లుండవు.. నెం 1 ఒక్కడే ఉంటాడు.. అది మా తలైవా అంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు లియోపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.