TV9 Telugu
ఆ కారణాల వల్ల నాకు అవకాశాలు తగ్గిపోయాయి అంటున్న జగపతిబాబు.
10 April 2024
టాలీవుడ్ లో జగ్గుభాయ్ అంటే తెలియని ఉంటారా.? ఇప్పుడు జగ్గు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.
ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈక్రమంలో తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు.
నాకు చిన్న సినిమాలు చేయాలని ఉంది, అందులో కంటెంట్ కూడా కొత్తగా ఉంది. ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే.. నేను డబ్బున్న పేదవాడిని.
నా చేతిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. కానీ ఆ షూటింగ్స్ వాయిదా పడుతూనే ఉంటాయి. ఆ సినిమాలు ఉన్నాయ్ కదా అని..
నాకు వేరే అవకాశాలు రాలేడు లేదు. మరోపక్క.. అమ్మో జగపతి బాబు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని అనుకుంటున్నారు.
ఇలా పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడం వల్ల నాకు అవకాశాలు రావడం లేదు. గతంలో రెండు మూడు సార్లు నా పని అయిపోయిందని అన్నారు.
అప్పుడు ఓ స్టేజీలో నేను అనుకున్నారు. కానీ మీ జగపతి బాబు ఎక్కడికీ పోడు. వెళ్లినట్లు వెళ్లినా మళ్లీ వస్తూనే ఉంటాను.”
ఈ మధ్య కాస్త అవకాశాలు తగ్గాయి అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు జగపతిబాబు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి