మహేష్ పై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

TV9 Telugu

11 April 2024

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చే సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి.

గతంలో మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయన్న సంగతి తెలిసిందే.

తాజాగా గుంటూరు కారం సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్  మొదట మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాతర్వాత మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయింది.

రికార్డ్‌ లెవల్‌ కలెక్షన్స్‌ వచ్చేలా చేసింది. అయితే ఇన్ని రోజులకు తాజాగా ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్‌ చేశారు ఈ సినిమాలో నటించిన జగపతి బాబు.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వచ్చిన జగపతి బాబు.. తనకు సినిమా నచ్చలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అలాగే సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదన్నారు.

మహేష్ బాబుతో కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టమని.. కానీ, గుంటూరు కారం తనకెలాంటి సంతోషాన్ని కలిగించలేదన్నారు జగపతి బాబు.

మొదట్లో పాత్రలు బలంగా అనిపించాయని.. కానీ ఆ పాత్రలు వస్తూ పోతూ అంతా గందరగోళంగా మారిందన్నారు. చివరికి సినిమా షూటింగే పూర్తి చేయడం కష్టమైందని చెప్పారు.

తాను చేయాల్సినవన్నీ చేశానని.. ఇలాంటి సినిమాల్లో ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ మిస్ అవ్వాలని అనుకోలేదంటూ.. జగ్గు చెప్పారు.