21 November 2023

హాలీవుడ్ పిలుస్తోంది అంటున్న జగపతిబాబు !! 

మన దగ్గర హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్‌ కేరక్టర్లలోనూ మెప్పించడం మాత్రమే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ సత్తా చూపించిన క్రెడిట్‌ జగపతిబాబు సొంతం. 

హాలీవుడ్ పిలుస్తోంది ఏమంటారు? అంటూ యమా స్టైలిష్‌గా ఉన్న ఫొటోలు షేర్‌ చేశారు జగపతిబాబు. అప్పటి నుంచీ ఆయన కేరక్టర్ల మీద, ఆయన కెరీర్‌ మీద ఫోకస్‌ పెరిగింది. 

వెర్సటైల్‌ యాక్టర్‌  హాలీవుడ్‌ వెళ్లిపోతే ఇక్కడ ఆయన ప్లేస్‌ని ఎవరు రీప్లేస్‌ చేస్తారా? అనే డిస్కషన్‌ షురూ అయింది. వెంటనే అందరి చూపులూ సునీల్‌ వైపు తిరుగుతున్నాయి. 

ఇటీవల జైలర్‌ మూవీలో మంచి రోల్‌ చేశారు సునీల్‌. వా నువు కావాలయ్యా అంటూ కోలీవుడ్‌ సునీల్‌ని రారమ్మని పిలుస్తోంది. కోలీవుడ్‌లో చాలా సినిమాలకు సైన్‌ చేశారట సునీల్‌.

ఆ విషయాన్ని రీసెంట్‌గా జపాన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో కార్తి కూడా షేర్‌ చేశారు. 

తెలుగులోనూ పుష్పలో మంచి రోల్‌ చేశారు సునీల్‌. కమెడియన్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసి, హీరోగా టర్న్ అయి, ఇప్పుడు విలన్‌గా బిజీ అవుతున్న సునీల్‌ 

జగపతిబాబు రూట్లో సునీల్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.