ఫ్యామిలీ హీరో టూ.. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ విలన్ గా ట్రాన్స్ ఫాం అయిన జగపతి బాబు.. ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంటారు.
తన ఫండా ఏంటో క్లియర్ కట్ గా చెప్పేస్తుంటారు. కాస్త డిఫరెంట్ యాటిట్యూడ్తో.. తనో వేరే అనే కామెంట్ ఇండస్ట్రీలో వచ్చేలా కూడా చేసుకున్నారు.
తాజాగా తన మీదే తాను సెటైర్ వేసుకున్నారు. ఫ్రెండ్స్ తో తాగి తందనాలు ఆడడం అంటే ఇదే అంటూ.. తన షర్ట్ లెస్ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఎస్ ! రీసెంట్ డేస్లో సినిమాలతో పాటు.. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా కనిపిస్తున్న జగపతి బాబు.. తాజాగా ఉన్నట్టుండి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ ఫోటోను షేర్ చేసుకున్నారు.
తన ఫ్రెండ్స్‌తో.. పార్టీ చేసుకున్న సంగతిని.. ఆపార్టీలో పీకల దాకా తాగి.. షర్ట్ విప్పేసి ఎరిగిన జ్ఙాపకాలని గుర్తు చేసుకున్నారు.
షేర్ చేయడమే కాదు.. ఫ్రెండ్స్‌తో తాగి బట్టలు ఊడదీసి తందనాలు ఆడడం అంటే ఇదే అంటూ.. ఆ ఫోటో కింద రాసుకొచ్చారు.
అంతేకాదు తన మాటలతో.. తన షేర్ చేసుకున్న ఫన్నీ ఫోటోతో ఇఫ్పుడు నెట్టింట ఎక్కడ పడితే అక్కడ కనిపించేస్తున్నారు.
తన ఫ్రాంక్ యాటిట్యూడ్‌తో.. జగ్గూ భాయ్ అంటే.. వేరే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు ఇది చుసిన అభిమానులు.