నా వీడియోలు వైరల్ చేస్తున్నారు.. రీతూ ఎమోషనల్ 

22 December 2023

TV9 Telugu

ఓ పక్క డీప్‌ ఫేక్ వీడియోలు.. ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే.

బుల్లి సెలబ్రిటీలు కూడా మార్ఫింగ్ ఫోటోలు.. వీడియోలతో.. నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.

ఇక తాజాగా జబర్దస్త్‌ ఫేం రీతూ కూడా... ఇలాంటి వీడియోల వల్ల.. తల్లెత్తుకోకపోతున్నా అని అవేదన వ్యక్తం చేస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు.

బుల్లితెర షోల్లో హంగామా చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్న రీతూ.. ఇంకో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌ గానే ఉంటుంది.

ఇక ఈ క్రమంలోనే తన యూట్యూబ్‌లో ఛానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.

ఇక ఆ వీడియోలో.. కొంత మంది తన వీడియోలను.. ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారని ఎమోషనల్ అయింది.

అంతేకాదు.. తన ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్న వారిపై సైబరాబాద్‌ సెల్లో కంప్లైట్ చేసినట్టు కూడా చెప్పింది.