బిగ్‌బాస్‌లోకి బబర్దస్త్ బ్యూటీ.. ఇక సీజన్ రచ్చ రచ్చే..
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మరో రెండు రోజుల్లో స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 8 సీజన్స్ పూర్తయ్యాయి.
ఇక ఇప్పుడు స్టార్ట్ కానున్న సీజన్ 9 పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. ఈ షోలోకి వెళ్లే కంటెస్టెంట్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి సీజన్ 9లోకి జబర్దస్త్ ముద్దుగుమ్మ రీతూ చౌదరి వెళ్లనుందట. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
నిజానికి గతంలోనే ఈ బ్యూటీకి బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చిందట. కానీ పలు కారణాలతో వెళ్లలేకపోయిందట. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హౌస్ లోకి వెళ్లనుందని టాక్.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి.. అటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
నెట్టింట ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ తన పర్సనల్ లైఫ్ విషయాలు పంచుకుంటుంది. అలాగే పలు వివాదాల్లోనూ చిక్కుకుంటుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై చాలా ఫేమస్ అయ్యింది. రీతూ చౌదరితోపాటు జబర్దస్త్ ఇమ్మాన్యూయేల్ సైతం ఈసారి హౌస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం.
వీరితోపాటు బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ, వెంకటేశ్ నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ ఆశా షైనీ, సీరియల్ నటి తనూజ, ఫోక్ సింగర్ రాము రాథోడ్ వెళ్లనున్నారట.