ఏడడుగులు నడిచేందుకు రెడీ అయిన శ్రీముఖి! వరుడు ఎవరంటే?

TV9 Telugu

12 May 2024

తనదైన మాటలు, పంచ్‌లతో తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్టార్ యాంకర్ శ్రీముఖి అలియాస్ బుల్లితెర రాములమ్మ.

కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ  ఆ తర్వాత ఫుల్ ఫోకస్డ్ గా బుల్లితెరపైనే దృష్టి పెట్టింది.

మధ్యలో బిగ్ బాస్ షో కు వెళ్లి రన్నరప్ గా నిలిచింది. ఈ రియాలిటీ షోతో శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎక్కువ షోలకు హోస్ట్ గా,  యాంకర్‌ గా వ్యవహరిస్తున్నదీ బుల్లితెర రాములమ్మ అనే చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే శ్రీముఖి పెళ్లి వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే  ఈ రాములమ్మ మాత్రం ఎప్పటికప్పుడు తన పెళ్లి వార్తలను కొట్టిపారేస్తోంది.

తాజాగా శ్రీముఖి ఫ్రెండ్ అయిన ముక్కు అవినాష్ ఓ ఇంటర్వ్యూలో శ్రీముఖి పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ప్రస్తుతం శ్రీముఖి వాళ్లింట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఏడాదిలోనే వివాహం జరగొచ్చని అన్నాడు.

దీనిబట్టి  చూస్తే త్వరలో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తుందని తెలుస్తోంది. మరి వరుడు ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.