ఆ వెన్నల ఈ వయ్యారి చెంతకు చెంతకు చేరి.. తనను పరిణయమాడమని అడగదా..

TV9 Telugu

15 April 2024

25 ఫిబ్రవరి 2000న కేరళ రాష్ట్రంలోని చంగనాచెరిలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది ఇవానా అలియాస్ అలీనా షాజీ.

తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీ నుంచి బికామ్ డిగ్రీ పట్టా పొందింది. 12 ఏళ్ల వయస్సులోనే మలయాళీ చిత్రం మాస్టర్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.

తమిళ చిత్రం నాచియార్‌లో ఈ బ్యూటీ నటనకి తమిళంలో సిమ్మా, ఫిల్మ్‌ఫేర్ వేదికల్లో ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డులు అందుకుంది.

ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు షాజీ చెరియన్. లియో, లయ అనే ఇద్దరు కవల సోదరుడు, సోదరి కూడా ఉన్నారు ఈ ముద్దుగుమ్మకి.

2022లో లవ్ టుడే అనే కోలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన తొలిసారి కథానాయకిగా కనిపించింది.

తర్వాత 2023లో కోలీవుడ్ ఇండస్ట్రీలో  LGM (లెట్స్ గెట్ మ్యారేజ్) సినిమాలో కథానాయకిగా చేసింది ఈ బ్యూటీ.

అదే ఏడాది మతిమారన్ అనే ఫ్యామిలీ డ్రామా చిత్రంతో మరోసారి తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఈ అందాల భామ.

ఆశిష్ కి జోడి హీరోయిన్ గా సెల్ఫిష్ అనే చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం కానుంది ఈ వయ్యారి భామ.