ఆ చుక్కలను బొమ్మగా మలచి ఈమెకు పాలతో ప్రాణం పోశాడేమో ఆ బ్రహ్మ..

06 December 2023

25 ఫిబ్రవరి 2000న కేరళ రాష్ట్రంలోని అలువాలో జన్మించింది వయ్యారి భామ ఇవానా. ఈమె అసలు పేరు అలీనా షాజీ.

2012లో మాస్టర్స్ అనే ఓ మలయాళీ చిత్రంలో సహాయక పాత్రలో బాలనటిగా సినిమా ప్రయాణం ప్రారంభించింది ఈ బ్యూటీ.

రాణి పద్మిని, అనురాగ కరికిన్ వెల్లం అనే మరో రెండు మలయాళీ చిత్రాల్లో బాలనటిగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

2018లో జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన నాచియార్ అనే చిత్రంలో ఓ కీలక పాత్రతో తమిళ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

2019లో శివ కార్తికేయన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా వచ్చిన హీరో చిత్రంలో తన నటనతో మరోసారి తమిళ ఆడియెన్స్ తో ఆహా అనిపించుకుంది.

2022లో లవ్ టుడే అనే ఓ కోలీవుడ్ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ సరసన తొలిసారి కథానాయకిగా నటించింది ఈ అందాల తార.

ఈ ఏడాది క్రికెటర్ ధోని ప్రొడక్షన్ లో వచ్చిన LGM: లెట్స్ గెట్ మారీడ్ చిత్రంలో హీరోయిన్ గా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం తమిళంలో కాల్వన్, కాంప్లెక్స్ అనే చిత్రాలతో పాటు తెలుగులో సెల్ఫిష్ అనే చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది.