ఇవానా తెలుగు ప్రేక్షకులకు.. కుర్రకారుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. లవ్ టుడే హీరోయిన్ గా నటించి అందరిని మనసులు దోచుకుంది
లవ్ టుడే సినిమాతో సక్సెస్ అందుకుంది ఇవానా. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అలీనా షాజీ.. పేరు పలకడానికి కష్టంగా ఉండటంతో ఇవానా గా పేరు మార్చుకుంది.
అయితే ఈ ముద్దుగుమం 25 ఫిబ్రవరి 2000న కేరళలోని చంగనాచెరిలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఇవానా.
12 ఏళ్ల వయస్సులోనే 2012 మలయాళీ చిత్రం మాస్టర్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది.
ఇవానా నటించిన నాచియార్ అనే సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో జాన్సీగా రిలీజ్ అయ్యింది.
2022లో "లవ్ టుడే"లో నిఖిత పాత్రతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది. ఈ చిత్రం భారీ వసూళ్లతో విజయం సాధించి, తెలుగులో 2022 నవంబర్ 25న విడుదలైంది. ఈ సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది.
ఇక ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా నటించిన 'సింగిల్' అనే సినిమాలో ఇవానా నటించగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.