ఇంత అందం భువిపై తిరిగితే ఆ స్వర్గంబోసిపోతుందేమో..

04 October 2023

కాదలిల్ సోదప్పువదు యెప్పడి (తెలుగులో లవ్ ఫెయిల్యూర్) అనే చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అయింది ఐశ్వర్య మీనన్.

తర్వాత 2013లో తమిళంలో ఆపిల్ పెన్నే, తీయ వేళై సెయ్యనుం కుమారు అనే చిత్రాల్లో లీడ్ రోల్స్ లో మెప్పించింది.

దీని తర్వాత 2013లోనే దసవల అనే చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కుర్రాళ్లను ఆకట్టుకుంది.

2014లో కన్నడ నమో భూతాత్మ అనే హారర్ కామెడీ చిత్రంలో కథానాయకిగా నటించి ఆకట్టుకుంది. మురళి ఈ చిత్రానికి దర్శకుడు.

తర్వాత రెండు ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. 2016లో మాన్ సూన్ మంగోస్ అనే చిత్రంతో ముల్లూవుడ్ కి పరిచయం అయింది.

తర్వాత వీర, తమిళ్ పదం 2, నాన్ సిరితల్, వెజం వంటి తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది తమిళ పన్ను ఐశ్వర్య.

ఇండస్ట్రీకి వచ్చిన 11 ఏళ్ళ తర్వాత తెలుగులో యంగ్ హీరో నిఖిల్ కి జోడిగా యాక్షన్ థ్రిల్లర్ స్పై అనే చిత్రంలో నటించింది ఈ భామ.

ఈ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా.. తన అందాలతో తెలుగు కుర్రాళ్లను మంత్రముగ్దులను చేసింది ఈ వయ్యారి.